'సాహో'పై కాపీ రైట్ కేసు వేస్తే?
on Aug 31, 2019

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అజ్ఞాతవాసి' మూలకథ ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్'ది. అవునని కానీ, కాదని కానీ త్రివిక్రమ్ చెప్పలేదు. కానీ, విడుదలకు ముందే విషయం బయటకు పొక్కింది. 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ 'అజ్ఞాతవాసి' కథ తన చిత్రకథకు దగ్గరగా ఉందని ట్వీట్స్ చేశాడు. 'లార్గో వించ్'ను ఫ్రీమేక్ చేసినందుకు హారిక అండ్ హాసిని సంస్థకు, ఆ సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న టీ సిరీస్ సంస్థ లీగల్ నోటీసులు పంపారు. సీక్రెట్ సెటిల్మెంట్ జరిగింది. అదే 'లార్గో వించ్' కథను మాఫియా నేపథ్యంలో 'సాహో'గా తీశారు. ఈ సినిమాపైనా కాపీ రైట్ కేసు వేస్తే అనే సందేహం పలువురికి వచ్చింది. స్టోరీ క్రెడిట్స్ ఇవ్వనందుకు 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ ట్విట్టర్ వేదికగా గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, కాపీ రైట్ కేసు నిలబడే అవకాశాలు తక్కువ. 'లార్గో వించ్' ఇండియన్ రైట్స్ సొంతం చేసుకున్న టీ సిరీస్ సంస్థ 'సాహో'ను హిందీలో విడుదల చేసింది. వాళ్ల కథే అని వాళ్లకు తెలిసి ఉండాలి. కాకపోతే సీక్రెట్ సెటిల్మెంట్ లో తెలుగు రైట్స్ 'అజ్ఞాతవాసి' నిర్మాత సొంతం చేసుకుంటే, వాళ్లు రాయల్టీ అడిగే అవకాశం ఉంటుందేమో. కథపై వస్తున్న విమర్శలకు 'సాహో' దర్శకుడు సుజీత్, హీరో ప్రభాస్, నిర్మాతలు వంశీ-ప్రమోద్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



