మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించిన 'పుష్ప'!
on Dec 20, 2021

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డు కలెక్షన్లను సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాల్లో మూడో రోజు 14.38 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు సినిమాకు సంబంధించి మూడో రోజు వసూళ్లపరంగా ఇది నాన్-బహుబలి రికార్డు. దీంతో మూడు రోజులకు ఈ ప్రాంతాల్లో 'పుష్ప' వసూళ్లు రూ. 52.98 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి.
Also read: కలెక్షన్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీగా 'పుష్ప'.. తగ్గేదే లే!
మూడో రోజు తెలంగాణలో రూ. 7.14 కోట్లు, ఆంధ్రలో రూ. 4.66 కోట్లు, రాయలసీమలో రూ. 2.58 కోట్ల షేర్‌ను 'పుష్ప' వసూలు చేసింది. అంతకు ముందు 'పుష్ప'.. ఫస్ట్ డే రూ. 24.90 కోట్లు, సెకండ్ డే రూ. 13.70 కోట్ల షేర్ సాధించింది. అంటే రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
Also read: 'వకీల్ సాబ్' తర్వాతి ప్లేస్‌లో 'పుష్ప'! మూడో ప్లేస్‌లో 'అఖండ'!
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగునాట అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో 'పుష్ప' చూపించింది. పుష్పరాజుగా బన్నీ చెలరేగి చేసిన నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రష్మిక మందన్నతో బన్నీ రొమాన్స్ ఆకట్టుకుంటోంది. రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూర్చిన పాటలు ఆడియెన్స్‌ను అమితంగా అలరిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



