ఎంత మంచివాడవురా = గుజరాతీ 'ఆక్సీజన్' + కొత్త క్యారెక్టర్లు
on Jan 4, 2020

సంక్రాంతికి వస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా'కు మూలం ఓ గుజరాతీ సినిమా 'ఆక్సీజన్'. గుజరాతీ సినిమాను రీమేక్ చేస్తున్నారనే మాట ఎప్పటినుండో వినిపిస్తోంది. అయితే... ఈ సినిమాను రీమేక్‌గా పిలవడానికి దర్శకుడు సతీష్ వేగేశ్న ఇష్టపడడం లేదు. గుజరాతీ సినిమా స్ఫూర్తితో ఫ్రెష్ స్క్రిప్ట్ రాశానని ఆయన చెప్పారు.
"ఒక రోజు నిర్మాతలు ఉమేష్ గుప్తా, శివలెంక కృష్ణప్రసాద్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వారు 'తెలుగులో ఆక్సీజన్ సినిమాను రీమేక్ చేయడం మీకు ఇష్టమేనా?' అని అడిగారు. సినిమాలో సోల్ నాకు బాగా నచ్చింది. దాంతో ప్రేమలో పడ్డాను. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ. హీరో క్యారెక్టర్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందుకని, తెలుగులో చేయడానికి ఒప్పుకున్నాను. గుజరాతీ సినిమా కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చి, కొత్త క్యారెక్టర్లు యాడ్ చేసి ఫ్రెష్ స్క్రిప్ట్ రాశా" అని సతీష్ వేగేశ్న తెలిపారు.
'శతమానం భవతి' తరహాలో 'ఎంత మంచివాడవురా' కథ కూడా గోదావరి నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశాడు. 2017లో రెండు పెద్ద సినిమాల మధ్య సంక్రాంతికి విడుదలైన 'శతమానం భవతి' విజయం సాధించింది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాల మధ్య 'ఎంత మంచివాడవురా' విడుదలవుతోంది. పండగ సందర్భాల్లో ప్రతి సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఉంటారని, తమ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుందని సతీష్ వేగేశ్న నమ్మకంగా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



