ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఎంజాయ్ చేస్తే తప్పు లేదు!!
on Oct 14, 2022

ఏ ఇండస్ట్రీలోనైనా క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్. ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద ఎంతో మంది ఆర్టిస్టులు నోరు విప్పారు. ఎప్పటివో ఇన్సిడెంట్స్ ని కూడా తిరగతోడారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురై చాలా మంది తమ కెరీర్స్ ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ తరం నటి దివి క్యాస్టింగ్ కౌచ్ విషయంపై మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది.
"ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ని ఎలా ఫేస్ చేశారు? మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?" అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “నేను ఇప్పటివరకు అలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లాను. మన ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది. నేను ఎవరికి అంత ఛాన్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్.. అన్ని విషయాలు తెలిసినవారే ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఎంజాయ్ చేయడం.. అదంతా ఫైన్. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి.
మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన దివి.. బిగ్ బాస్ లో అడుగుపెట్టి మంచి పేరు దక్కించుకుంది అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతోంది. లేటెస్ట్ గా 'గాడ్ ఫాదర్' మూవీలో సునీల్ భార్యగా నటించడమే కాకుండా, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంది దివి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



