శీనూ.. నీలో నాకు నచ్చే విషయం అదే!
on Oct 14, 2022

గెటప్ శీను బుల్లితెర మీద ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్. ఇక సుమ యాంకరింగ్ క్వీన్. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక చిట్ చాట్ ఉంటే అది ఫుల్ మస్తీగా ఉంటుంది కదా. అందుకే వీళ్ళిద్దరూ "మొదలెడదామా ?" అంటూ ఒక ఫుడ్ వ్లాగ్ చేశారు. ఇక ఈ వీడియోలో ఇద్దరూ ఫుల్ గా కుమ్మేసారు ఫుడ్ ఐటమ్స్ తో. మధ్యలో "అనసూయను ఏమని పిలుస్తావ్" అనేసరికి "అను" అని పిలుస్తాను అని చెప్పాడు శీను.
ఇక "శీను మీ ఆవిడ సుజి బాగా చేసే వంటలు, బాగా చేయని వంటలు చెప్పు" అనేసరికి "వంకాయ, బెండకాయ, దొండకాయ ఫ్రైస్ బాగా చేస్తుంది. ఒక్కోసారి బాగా చేస్తుంది, ఒక్కోసారి బాగా చేయదు" అని చెప్పాడు. "శీనుని, సుధీర్ ని, రాంప్రసాద్ ని పెట్టి ఒక మూవీ రీమేక్ చేస్తే ఏ మూవీ సూట్ అవుతుంది" అని అడిగింది సుమ. "జాతిరత్నాలు" అని ఆన్సర్ ఇచ్చాడు శీను. "నిజమే ఆ సినిమా మీ ముగ్గురితో తీస్తే బాగుండేది" అంది సుమ.
ఇక తర్వాత వెంకటేష్, విజయ్ దేవరకొండ, నాగార్జున, బాలయ్య బాబు వాళ్ళను ఇమిటేట్ చేసి చూపించాడు శీను. "ఇప్పటివరకు ఉన్న ఫిమేల్ జడ్జెస్ లో రోజా, ఇంద్రజ, కుష్బూ ఈ ముగ్గురిలో ఎవరి జడ్జిమెంట్ ఇష్టం" అనేసరికి "ఆయా స్కిట్స్ ని బట్టి వాళ్ళ ముగ్గురు మంచి జడ్జిమెంట్ ఇస్తారు" అని చెప్పాడు. "ఇక మేల్ జడ్జెస్ లో నాగబాబు గారి జడ్జిమెంట్ ఇష్టం. ఆయన లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు" అని చెప్పాడు శీను.
"నేను గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫ్లయిట్ లో ఇంటర్వ్యూ మిస్ అయ్యాను. ఎందుకంటే నేను బాలి వెళ్లాను. ఇక ఈ ఫంక్షన్ మిస్ ఐనందుకు అందరూ తెగ న్యూస్ రాసేసుకున్నారు" అని సుమ, "ఇక మొన్న జరిగిన నా బర్త్డే కి చిరు గారు ఫోన్ చేసి, విష్ చేశారు, గిఫ్ట్స్ కూడా పంపించారు" అని చెప్పింది సుమ. "శీను నీలో నాకు నచ్చే విషయం ఏంటి అంటే ఏ టైంలో పిలిచినా రాను, కుదరదు అని అస్సలు చెప్పవు. సింపుల్ గా చెప్పాలంటే చిరుగారిలా అన్నమాట. ఆయన అంతే 'నో' అని చెప్పరు" అంటూ శీనుకి కాంప్లిమెంట్ ఇచ్చేసింది సుమ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



