బాలయ్య సినిమాని అందుకే వదిలేశారు
on Sep 12, 2016

నందమూరి బాలకృష్ణ, నయనతారలది హిట్ కాంబినేషన్. సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు ఈ జంటకు మంచి పేరు తీసుకొచ్చాయి. గౌతమి పుత్ర శాతకర్ణిలోనూ నయనతారనే కథానాయికగా ఎంచుకొందామనుకొన్నారు. బాలయ్యతో జట్టు కట్టడానికి నయన కూడా సై అంది. కానీ కథ విన్న తరవాత డ్రాప్ అయ్యిందట. ఎందుకంటే.. గౌతమి పుత్రలో కథానాయిక పాత్ర అంటే అంత ఆషామాషీ వ్యవహారంకాదు. ఇందులో కథానాయిక ఓ బిడ్డకు తల్లి పాత్రలో కనిపించాల్సి ఉంటుంది. దానికి తోడు ఎమోషన్, సెంటిమెంట్ డోసు ఎక్కువగా ఉంటుంది. అందుకే నయన చో చెప్పినట్టు టాక్. మరీ డీ గ్లామర్ రోల్‌లో చేస్తే... ఇమేజ్‌కి డామేజ్ వస్తుందేమో అని భయపడిందట. నయనే కాదు.. అనుష్క కూడా ఇదే కారణంతో ఈ సినిమాలో నటించడానికి వెనుకడుగు వేసిందని సమాచారం. కానీ.. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రియ మాత్రం ఈ ఛాన్స్‌కి చేజిక్కించుకొంది. గౌతమి పుత్ర హిట్టయితే... శ్రియ కెరీర్ ఇంకొంత కాలం ముందుకెళ్లే అవకాశం ఉంది. ఫ్లాప్ అయితే వచ్చిన నష్టమేం లేదు. అందుకే ధైర్యంగా ఈ సినిమా చేసిందట. ఇటీవల శ్రియ లుక్ కూడా విడుదల చేశారు. అందులో శ్రియ ఈ పాత్రని పిండేసినట్టే కనిపిస్తోంది మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



