జనతా.. సక్సెస్‌మీట్ల జాతర
on Sep 12, 2016
సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే.. హిట్ టాక్ వచ్చినా సరే, ప్రమోషన్లతో మోతెక్కించేయాల్సిందే. టీజర్లు, ఫస్ట్ లుక్‌కూ, ట్రైలర్లూ, ఆడియో ఫంక్షన్లూ అంటూ ఎడాపెడా ప్రమోషన్లు చేస్తున్నారు. దానికి తోడు సక్సెస్‌మీట్లు, థాంక్స్ మీట్లూ పెట్టేస్తున్నారు. ఇది వరకు సక్సెస్ మీట్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఎన్నికావాలంటే అన్ని. జనతా గ్యారేజ్ విషయంలో అదే జరుగుతోంది. విడుదలైన రెండే రోజే సక్సెస్ మీట్ పెట్టారు. మొన్నటికి మొన్న థ్యాంక్స్ మీట్ సాగింది. ఇక్కడితో ఈ ప్రచార ప్రహసనం అయిపోలేదు. ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ మీట్ అంటూ మరోటి నిర్వహిస్తున్నారు.మంగళవారం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. థాంక్స్ మీట్‌కి ఫ్యాన్స్ కి ఆహ్వానం అందలేదు. కానీ మంగళవారం నాటి సభకు మాత్రం ఫ్యాన్స్ కి ఆహ్వానం అందింది. అభిమానుల మధ్య విజయోత్సహమన్నమాట. జనతాకు ఇంకెన్ని సక్సెస్ మీట్లు పెడతారో? అయినా హిట్టు - ఫ్లాప్ అనేది జనం చెప్పాలి. వీళ్లకు వీళ్లే డప్పు కొట్టుకోవాల్సివస్తోంది.