మల్టిస్టారర్ ప్లాన్ లో పరశురామ్!
on Jan 10, 2022

ప్రీవియస్ మూవీ `గీత గోవిందం`(2018)తో సంచలన విజయం అందుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో `సర్కారు వారి పాట` తీస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అన్నీ అనుకూలంగా ఉంటే ఏప్రిల్ 1న థియేటర్స్ లోకి వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట` తరువాత పరశురామ్ ఓ మల్టిస్టారర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఇందులో ముగ్గురు స్టార్స్ కలిసి నటించబోతున్నారని, ముగ్గురు కూడా వేర్వేరు భాషలకు చెందిన అగ్ర కథానాయకులే అని బజ్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతోందని ఇన్ సైడ్ టాక్. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాని.. 2023లో విడుదల చేసే దిశగా పరశురామ్ సన్నాహాలు చేసుకుంటున్నారట. త్వరలోనే పరశురామ్ రూపొందించబోయే మల్టిస్టారర్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముందంటున్నారు. మరి.. ఈ మల్టిస్టారర్ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



