మహేష్ బాబుకి బ్యాడ్ టైం.. ఆందోళనలో ఫ్యాన్స్!
on Jan 10, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబుకి బ్యాడ్ టైం నడుస్తుండటం ఆయన ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. సర్జరీ, కరోనా, రమేష్ బాబు మరణం ఇలా వరుస విచార సంఘటనలతో సతమతమవుతున్న మహేష్ ని చూసి ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మహేష్ మోకాలికి సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ 1 న 'సర్కారు వారి పాట' విడుదల కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మోకాలి సర్జరీతో రెస్ట్ తీసుకుంటున్న మహేష్ కొద్దిరోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మహేష్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్న వేళ మరో ఊహించని సంఘటన జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు.
మహేష్ కి ఆయన సోదరుడు రమేష్ అంటే ఎంతో ఇష్టం. రమేష్ మరణం మహేష్ ని తీవ్ర విషాదంలో నింపింది. దానికితోడు కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్న మహేష్ కి తన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం మరింత బాధ కలిగించే విషయం. కరోనా నుంచి, ఈ బాధ నుంచి మహేష్ త్వరగా కోలుకోవాలని, ఆయనకి మంచి రోజులు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



