ఎన్టీఆర్ పెదనాన్నను వెంటాడుతున్న కేసు
on Oct 19, 2016
మోహన్‌లాల్..నటనకే భాష్యం చెప్పిన మేటి నటుడు.. ఆయన నటనకు మెచ్చుకుని ఎన్నో అవార్డులు మోహన్‌లాల్‌ను కోరి వరించాయి..ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటినిస్తూ తనలో వాడి ఇంకా తగ్గలేదని నిరూపించారు మోహన్‌లాల్. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు పెదనాన్నగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అలాంటి వ్యక్తిని ఒక కేసు మూడు దశాబ్ధాల నుంచి వెంటాడుతోంది.
1988లో మోహన్‌లాల్ ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు జరిపిన సమయంలో రెండు జతల ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీనిపై కేరళ అటవీశాఖ కేసు నమోదు చేసింది. అయితే తాను ఏనుగు దంతాలు కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు. అయితే నాటి మంత్రి రాధాకృష్ణన్, కేసును ఎత్తివేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త ఏఏ పౌలాస్ కొచ్చి విజిలెన్స్ న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఈ వ్యవహరంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో కేసు మళ్లీ బయటకొచ్చినట్లైంది.