2020లో దిల్ రాజు 3 రీమేక్స్
on Feb 3, 2020
సాధారణంగా రీమేక్స్ ఇష్టపడని నిర్మాత దిల్ రాజు 2020లో ఏకంగా 3 రీమేక్స్ తీస్తుండటం గమనార్హం. వాటిలో సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో తీసిన '96' (తమిళ్) మూవీ రీమేక్ 'జాను' ఫిబ్రవరి 7న విడుదల అవుతోంది. దీనికి సి. ప్రేమ్ కుమార్ దర్శకుడు. అలాగే హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ 'పింక్'ను దిల్ రాజు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమా మే 15న విడుదల అవుతుందని ఆయన ప్రకటించాడు. టైటిల్‌ను ఉగాది పర్వదినం (మార్చి 25)న వెల్లడిస్తామన్నాడు. అయితే ఇప్పటికే చాంబర్‌లో 'వకీల్ సాబ్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకుడు.
ఇక మూడో రీమేక్.. తెలుగు 'జెర్సీ'కి హిందీ రీమేక్. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి హిందీలో అదే డైరెక్టర్‌తో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. నాని చేసిన క్యారెక్టర్‌ను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఈ మూవీ 2020 ఆగస్టులో రిలీజవుతుంది. ఇలా ఒకే సంవత్సరం 3 రీమేక్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు దిల్ రాజు.