'దిగు దిగు దిగు నాగ' సాంగ్ వచ్చేసింది
on Aug 4, 2021
టాలీవుడ్ లో ఫోక్ సాంగ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. 'లవ్ స్టొరీ' మూవీ లోని 'సారంగ దరియా'తో పాటు పలు ఫోక్ సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా 'దిగు దిగు దిగు నాగ' అంటూ మరో ఫోక్ సాంగ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది.
నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్లగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వరుడు కావలెను'. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, కోల కళ్ళే ఇలా సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. 'దిగు దిగు దిగు నాగ' అనేది ఫేమస్ ఫోక్ సాంగ్. దానిని ప్రేరణగా తీసుకొని ఈ పాటని కంపోజ్ చేశారు.
తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. బీట్ చాలా హుషారుగా ఉత్సాహంగా సాగింది. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ ని శ్రేయ ఘోషాల్ ఆలపించారు. ఆమె వాయిస్ ఈ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.
Also Read