కొడుక్కి నామకరణం చేసిన శివకార్తికేయన్.. తండ్రి పేరు కలిసొచ్చేలా..!
on Aug 4, 2021
తమిళ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ ఫ్యామిలీ ఫ్రెండ్ యాక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తల్లి, భార్య ఆర్తి, కూతురు ఆరాధనతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటీవల అతను రెండో సంతానానికి తండ్రయ్యాడు. అతని భార్య ఆర్తి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. పద్దెనిమిదేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి ఇప్పుడు తన కొడుకు రూపంలో మళ్లీ పుట్టాడని శివ నమ్ముతున్నాడు.
చిన్నారి కొడుకును పొదివి పట్టుకొని మురిపెంగా చూసుకుంటున్న అందమైన ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన శివకార్తికేయన్, "మా చిన్నారి బాబుపై ఆశీస్సులు కురిపించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమతో మా అబ్బాయికి గుగన్ దాస్ అనే పేరు పెట్టాం" అని రాసుకొచ్చాడు. మృతులైన శివ తండ్రి పేరు దాస్ కావడం గమనార్హం. తన కుమారుడి ద్వారా తండ్రి పేరును కొనసాగిస్తున్నాడు శివ.
సినిమాల విషయానికి వస్తే, శివ నటించిన 'డాక్టర్' మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాని తర్వాత అతను నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం అతను 'డాన్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్‌తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని చేయడానికి అతను అంగీకరించాడు.
Also Read