కర్ర తిప్పుతున్న పవర్‌స్టార్ వారసుడు.. ఫ్యూచర్ స్టార్ రెడీ అవుతున్నాడు!
on Aug 4, 2021
చూస్తుంటే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకిర నందన్ త్వరలో హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేట్లే కనిపిస్తోంది. రీసెంట్గా రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో చూస్తే.. ఎవరికైనా ఆ అభిప్రాయమే కలుగుతుంది. ఆ వీడియాలో అకిర బాణాకర్రను శరీరానికి రెండు వైపులా తిప్పుతూ కనిపిస్తున్నాడు. అతడు బాణాకర్రను చులాగ్గా తిప్పుతున్న వైనం చూస్తుంటే కర్రసాములో అతను ట్రైనింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్‌లో భాగంగా కర్రసాము నేర్చుకున్నారు. ఆయన కూడా బాణాకర్రను ముందు వైపే కాకుడా, శరీరానికి వెనుకవైపు కూడా తిప్పగలరు. కరాటేలో ప్రావీణ్యం సంపాదించిన పవన్ మరికొన్ని యుద్ధవిద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు. ఆయన నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, జానీ లాంటి సినిమాల్లో సందర్భానుసారం వాటిని ఉపయోగించడం మనం చూశాం.
ఇప్పుడు తన స్కిల్స్‌తో తండ్రిని గుర్తుకు తెస్తున్నాడు అకిర. జిమ్‌లో మాస్క్ పెట్టుకొని కర్రతో అకిర చేస్తున్న విన్యాసాలను బ్లాక్ అండ్ వైట్ వీడియో ద్వారా ఫ్యాన్స్‌కు చూపించారు రేణు. ఆ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ వారసుడు రాబోతున్నాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కంటే చాలా పొడగరి అయిన అకిర ఇప్పటికే పాటలు పాడుతున్నాడు, డాన్సులు చేస్తున్నాడు. మ్యూజిక్ లవర్ అయిన అతను ప్రస్తుతం కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అదవగానే అకిర హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read