మెగా ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్న చరణ్ కామెంట్స్
on Dec 19, 2016
మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక ఎప్పుడో మొదలైపోయింది. పవన్ కల్యాణ్ చిరుకి ఎప్పుడైతే దూరమైపోయాడో అప్పటి నుంచే... పవన్ ఫ్యాన్స్ - చిరంజీవి ఫ్యాన్స్ అంటూ అడ్డుగోడ పడిపోయింది. మెగా హీరో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవన్ ఫ్యాన్స్ గోల చేయడం, పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరవడం... ఇవన్నీ మెగా ఫ్యాన్స్ మధ్య చీలికకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. దానికి తోడు అల్లు అర్జున్ కూడా తన సొంత బలం చూపించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలని ఆశ పడుతున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ మధ్య గ్రూపులు మొదలైపోయాయి.
ఇటీవల రామ్ చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో `మా కుటుంబంలో చాలామంది హీరోలున్నారు. ఒక్కోక్కరికీ సెపరేట్‌గా అభిమానులు ఉంటే తప్పేంటి` అంటూ ఓ రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాన్ని బట్టి.. చరణ్ ఈ గ్రూపిజం ప్రోత్సహిస్తున్నట్టు అనుకోవాల్సిందే. చరణ్ సినిమా, అల్లు అర్జున్ సినిమాలు విడుదల అవుతున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే అని డప్పుకొట్టుకొనే హీరోలు.. ఇప్పుడు సెపరేటిజంని ప్రోత్సహిస్తూ మాట్లాడడమేంటి? బ్రూస్లీ విడుదలకు ముందు పవన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి అటు చిరు, ఇటు చరణ్ తహతహలాడారు. సర్దార్ సెట్‌కి చిరు వెళ్లడం వెనుక ఉన్న బలమైన రీజన్ ఇదే. ఇప్పుడు చరణ్ మాత్రం `అభిమానుల్లో గ్రూపులు ఉండడం తప్పు కాదు` అన్నట్టు మాట్లాడుతున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఇది మింగుడు పడని విషయమే.