ట్రైలర్ రివ్యూ: జాలీ ఎల్ఎల్‌బీ 2
on Dec 19, 2016
"రుస్తుం" సినిమా తర్వాత అక్షయ్ కుమార్ చేసే సినిమాపై బాలీవుడ్‌తో పాటు ఇండియన్ మూవీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. విభిన్నమైన కథలతో విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లను రాబట్టుకుంటున్నాడు అక్షయ్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సుభాష్ కపూర్ దర్శకత్వంలో 2013లో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీకి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్‌బీ-2లో నటిస్తున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు అక్షయ్..ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరి జాలీ ఎల్ఎల్‌బీలో పండినంత వినోదం ఇందులో ఉందా..? అక్షయ్ ఎలా నటించాడు అనేది చూస్తే..
న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని వినోదాత్మక కోణంలో చూపిస్తూ..కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ లాయర్ జగదీష్ మిశ్రాగా కనిపిస్తున్నాడు. "సల్మాన్‌ఖాన్‌కి పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసా" అంటూ అక్షయ్ కోర్టులో సాక్షిని ప్రశ్నిస్తుండగా ప్రారంభమయ్యే ట్రైలర్‌లో..అక్షయ్ లాయర్ పాత్రలో ఒదిగిపోయాడు..తనమార్క్ కామెడీతో..పంచ్‌లతో నవ్వులు పూయించడం చూస్తుంటే కామెడీ అదిరిపోయినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ హ్యూమా ఖురేషి అందచందాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు సుభాష్ పనితనం బాగా కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆదిరిపోయింది. మొత్తం మీద అక్షయ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవచ్చని అర్థమవుతుంది. 2017 ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read