ధర్మేంద్ర కొన్న ఈ ఫియట్ కారు ధర.. జస్ట్ 18 థౌజండ్!
on Oct 12, 2021
బాలీవుడ్ వెటరన్ స్టార్ ధర్మేంద్ర ఒక బ్లాక్ ఫియట్ కారును కొన్నారు. దాని ధర ఎంతో తెలుసా? జస్ట్.. రూ. 18 వేలు. అవునా! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆయన ఆ కారును కొన్నది ఇప్పుడు కాదు. 1960లో! పైగా ఆయన కొన్న మొట్ట మొదటి కారు కూడా అదే. ఇప్పటికీ ఆ కారు ఆయన గ్యారేజ్‌లో భద్రంగా ఉంది. ఆ కారుకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆయన షేర్ చేశారు.
కొత్త కారులా మెరుస్తున్న దానికి ఆనుకొని నిల్చొని, "హాయ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ కార్. దీన్ని నేను కేవలం రూ. 18,000 కొన్నాను. ఆ రోజుల్లో 18 వేలంటే చాలా పెద్ద విషయం. దీన్ని చక్కగా ఉంచాను. చూడ్డానికి బాగుంది కదూ? ఎప్పటికీ ఇది నాతోనే ఉండాలని ప్రార్థించండి." అని ఆయన చెప్పారు.
అలాగే, ఈ వీడియోను షేర్ చేసిన ఆయన, "ఫ్రెండ్స్, ఫియట్, నా ఫస్ట్ కార్, నా ప్రియమైన బేబీ.. నా హృదయానికి బాగా సన్నిహితమైంది. ఒక స్ట్రగులర్కి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం." అనే కాప్షన్ రాశారు.
ఒకప్పుడు హిందీ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందారు ధర్మేంద్ర. 'షోలే' మూవీలో వీర్ క్యారెక్టర్ ఆయనకు ఎంతటి పేరు తెచ్చిందో తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరణ్ జోహార్ మూవీ 'ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి తన కొడుకులు సన్నీ డియోల్, బాబా డియోల్‌తో పాటు 'అప్నే 2' సినిమాలో ఆయన నటించనున్నారు.
Also Read