దాసరి రాసిన పాటలు
on May 31, 2017

దర్శకుడు దర్శకత్వం మాత్రమే చేయాలనే రోజుల్లో కలం పవర్ చూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. సినిమాలకు కథను, స్క్రిప్ట్‌ను రాసుకునే సమయంలోనే పాటలు వచ్చే సందర్భాల్లో పల్లవులు రాసుకోవడం ఆయనకు అలవాటు. మనుషులంతా ఒక్కటే సినిమాలో స్వయంగా పాట రాశారు. కెరీర్ మొత్తం మీద చాలా తక్కువ పాటలు రాసినప్పటికీ వాటిలో భావజాలం ప్రజలను ఆలోచింపచేసి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.
వాటిలో కొన్ని:
* గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం- స్వయంవరం
* ఇదే నా మొదటి ప్రేమలేఖ..రాశాను నీకు చెప్పలేక-స్వప్న
* ఇది తొలి రాత్రి--కదలని రాత్రి-మజ్ను
* జననీ జన్మభూమిశ్చ....స్వర్గాదపీ గరీయసీ-బొబ్బిలిపులి
* నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని- ప్రేమాభిషేకం
* ఆగదూ ఆగదు...ఆగదు ఏ నిమిషము నీ కోసము- ప్రేమాభిషేకం
* నూటికో కోటికో ఒక్కరు..ఎక్కడో ఎప్పుడో పుడతారు- విశ్వరూపం
* తొలి సంజవేళలో..తొలి పొద్దుపొడుపులో- సీతారాములు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



