బాల్యంలో దాసరి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..?
on May 31, 2017
దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, సామాజిక ఉద్యమకారుడిగా, కేంద్రమంత్రిగా సేవలందించి..తెలుగు సినిమాకు పెద్దన్నగా వ్యవహరించిన దాసరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. నేడు పంచభక్ష్య పరమాన్నాలు ఎదురుగా ఉన్నప్పటికి నాడు తినడానికి తిండి లేక పస్తులున్న కన్నీటి వ్యథ. బతుకు బండిని నడపటానికి వడ్రంగి నుంచి సైకిల్ మెకానిక్ వరకు అన్ని పనులు చేశారు. దాసరి తండ్రి పొగాకు వ్యాపారి. ఆరుగురు సంతానంలో దాసరి మూడోవారు. పాలకొల్లులోని ఎంఎంకేఎన్ఎం హైస్కూలులో దాసరి 6వ తరగతి చదువుతున్నప్పుడు గోదాములోని పొగాకు కాలిపోవడంతో పరిస్థితి తిరగబడింది. కష్టం తప్ప సుఖం తెలియని పసితనంలో కాయకష్టం చేశారు. ఆఖరికి స్కూలు ఫీజు మూడు రూపాయల పావలా కట్టడానికి కూడా డబ్బులేని పరిస్థితుల్లో వడ్రంగి వద్ద నెలకు ఒక రూపాయి జీతానికి పనికి కుదిరారు. అన్ని కష్టాల మధ్యే..మొక్కవొని దీక్షతో డిగ్రీ పూర్తి చేశారు.