మంత్రిగా, సినీపెద్దగా పాలకొల్లుకు దాసరి చేసేందేమిటీ..?
on May 31, 2017
తెలుగు చిత్ర సీమలో అగ్రదర్శకుడిగా వెలుగొందుతూనే.. కేంద్రమంత్రిగా ప్రజాసేవకు కూడా అంతే అంకితమయ్యారు దాసరి నారాయణరావు. ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్‌లలో స్థిరపడినా ఆయన మనసంతా సొంతఊరు పాలకొల్లుపైనే ఉండేది. పాలకొల్లు నుంచి ఎవరైనా తనని కలవడానికి వచ్చినా..ఆ పేరు వినిపించినా పులకించిపోయేవారు. తన ఊరి వారితో ముచ్చట్లలో పడ్డారంటే ఇక అంతే సంగతులు. తనకు జన్మనిచ్చిన పాలకొల్లు రుణం తీర్చుకోవడానికి ఎంత చేయాలో అంత చేశారు. ప్రభుత్వ మహిళా కళాశాల నిర్మాణానికి, దళితవాడలో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి విరాళాలిచ్చారు. పాలకొల్లు ప్రధాన కాలువపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించారు. పట్టణం నుంచి ఎందరికో సినీ రంగంలో అవకాశాలు కల్పించారు. అలాంటి దాసరి ఇక లేరని తెలిసి పాలకొల్లు వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.