స్పైడర్ టీజర్ రివ్యూ
on Jun 1, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ టీజర్ మొత్తానికి విడుదలయింది. టీజర్ నిడివి 74 సెకండ్లు. ఇది చూడగానే, ఫాన్స్ ఎదో ఉంటుంది అని ఎక్ష్పెక్త్ చేస్తారు. కానీ, ఇందులో చూపించిన కంటెంట్ చాలా తక్కువే. చతుర్భుజాకారంలో ఉన్న ఒక రోబోటిక్ స్పైడర్ గా మారి ఒక వ్యక్తి షూస్ పైకి ఎక్కి, అలా అతని శరీరం మొత్తం తిరుగుతూ, భుజం పైకి రాగానే మొహం చూపిస్తారు. అతను మరెవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. స్పైడర్ ని సైలెంట్ గా ఉండమన్నట్టుగా ష్... అని చెప్పడంతో అది అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. టీజర్ కూడా అయిపోతుంది. రోబోటిక్ స్పైడర్ గా మారే విధానం, దాని గమనం బాగున్నాయి. మహేష్ బాబు కొన్ని సెకండ్లే కనిపించినా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.
హారిస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ టీజర్ ద్వారా, సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండొచ్చు అని హింట్ దొరుకుతుంది. బాహుబలి కి పనిచేసిన గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్ కనల్ కణ్ణన్ కి స్పైడర్ గ్రాఫిక్స్ బాధ్యతలు అప్పగించారు. ఒక రకంగా సినిమా విడుదల జాప్యానికి, గ్రాఫిక్స్ కూడా ప్రధాన కారణమే అని చెప్పొచ్చు. స్పైడర్ టీజర్ ఒక వర్గానికి నచ్చినా, మాస్ ఫాన్స్ ని అలరించే అంశాలేమి లేవు. కానీ, మొత్తానికి... స్పైడర్ టీజర్ బాగానే ఉంది. దసరా కి విడుదల చేస్తున్నట్టుగా టీజర్ లో ప్రకటించారు.
Also Read