పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు..లేరనకండి...వింటారు
on May 31, 2017
గుండె ఆడకపోతే ఏం?... దాసరి గారి సినిమా ఆడుతూనే వుంటుందిగా...
థియేటర్స్ లోనో, టి.వీ చానెల్స్ లోనో...
తాతా మనవడు నుంచి నూటయాభైఒక్క సినిమాలున్నాయి... ఆడుతూనే వుంటాయి.
భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరి గారు లేరనాలి... అది జరగదు కదా...
దాసరి గారంటే 74 ఏళ్ళు నిండిన వ్యక్తి కాదు
24 శాఖలు కలిసిన శక్తి..
ఇలాంటి వారికి జయ జయ ద్వానాలు ఉంటాయి .. కానీ జోహార్లు ఉండవు.
దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరి గారు వింటారు..
ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరి గారు ఉంటారు..
పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు..లేరనకండి...వింటారు
- క్రిష్ జాగర్లమూడి (దర్శకుడు)