సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు
on Jan 29, 2024
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా సినీ ప్రముఖుల బృందం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, రాయితీల అంశాలతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Also Read