హీరో తొట్టెంపూడి వేణు తండ్రి కన్నుమూత
on Jan 28, 2024
ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు(92) ఈరోజు(జనవరి 29) తెల్లవారుజామున కన్నుమూశారు.
భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.00 గంటలు నుండి మధ్యాహ్నం 12.00 ల మధ్య స్వగృహం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్ నందు ఉంచనున్నారు. అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12.30 తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నారు.
వేణు తండ్రి ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పూర్తి చేసి అధ్యాపకుడిగా విజయవాడ, చెన్నై, మధురైలో పనిచేశారు. మధురైలోని ప్రముఖ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ పొందారు.
కాగా 'స్వయంవరం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'కళ్యాణ రాముడు', 'పెళ్ళాం ఊరెళితే' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఒకవైపు బిజినెస్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నాడు.
Also Read