"నేను ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండను".. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
on Jan 2, 2022

కొత్త సంవత్సరాన్ని ఒక మంచి పనితో శుభారంభం చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ వర్కర్లకు హెల్త్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. యోధా డయాగ్నోస్టిక్స్‌తో కలిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తాను తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండాలనుకోవట్లేదని ఆయన చెప్పారు. తానెప్పుడూ దానికోసం పాకులాడలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. "అనవసరంగా తగుదునమ్మా అని ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఉండదు. ఆ పదవి నాకు వద్దు" అని ఆయన చెప్పారు.
Also read: తెలంగాణలో రూ. 20 కోట్ల (షేర్)ను క్రాస్ చేసిన 'అఖండ'!
అయితే తాను సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన చెప్పారు. అలాగే ఎలాంటి గొడవల్లోనూ తాను తలదూర్చనని స్పష్టం చేశారు. "బాధ్యత తీసుకుంటాను. ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరెవరో కొట్టుకుంటుంటే వచ్చి తీర్చమంటే అలాంటి తగువుల్ని నేను తీర్చలేను. అవి నాకొద్దు. ఆరోగ్య సమస్య అయినా, ఉపాధి సమస్య అయినా, ఇంకో సమస్య అయినా నేను డెఫినెట్‌గా ఉంటాను.. అదీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని" అని చెప్పారు చిరంజీవి.
Also read: మెగాస్టార్ 'ఆచార్య' లేటెస్ట్ అప్డేట్.. శానా కష్టం!
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తిచెందుతున్నందున సినీ కార్మికులందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరారు. ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా సంచలనంగా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



