
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 4 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా '2022 ని హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం' అంటూ తాజాగా మూడో సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ఆచార్య మూవీ టీమ్. 'శానా కష్టం' అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోని జనవరి 3 న సాయంత్రం 4:05 కి విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో మెగాస్టార్ స్టిల్ ని చూస్తుంటే మరోసారి ఆయన తన గ్రేస్ తో ఈ సాంగ్ లో డ్యాన్స్ అదరగొడతారని అర్థమవుతుంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.






