Home

»

Latest News

'రావ‌ణాసుర‌'కు క్లాప్ కొట్టిన చిరు!

Jan 14, 2022 2:24PM

 

మాస్ మ‌హారాజా ర‌వితేజ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'రావ‌ణాసుర' మూవీ షూటింగ్ శుక్ర‌వారం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, డైరెక్ట‌ర్లు గోపీచంద్ మ‌లినేని, కె.ఎస్‌. ర‌వీంద్ర సంయుక్తంగా గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం అందించారు. అంత‌కుముందు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు చిత్ర ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ చేతికి స్క్రిప్టును అంద‌జేశారు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఆర్టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముహూర్త‌పు షాట్‌కు క్లాప్‌కొట్టిన చిరు 'రావణాసుర' పోస్టర్‌ను కూడా ఆవిష్క‌రించారు. ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ పైన బ్లాక్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగిస్తున్నాడు. అత‌న‌ని షర్ట్ పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపిస్తున్నాయి. 'పుష్ప‌'కు సంభాష‌ణ‌లు అందించిన‌ శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ అనే కీల‌క పాత్ర‌లో యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నాడు. అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ అందరికీ ఇంపార్టెన్స్ వుండే విధంగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు. 

Also read: ​ర‌వితేజ‌తో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ రొమాన్స్!

ఈ నెలలోనే సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రవితేజని డిఫరెంట్ క్యారెక్టర్ లో సుధీర్ వర్మ ప్రజెంట్ చేయనున్నాడు. 2022 సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ వైరల్ అయ్యింది.

Also read: ​మెగాస్టార్ తో మాస్ మ‌హారాజా.. అధికారిక‌ ప్ర‌క‌ట‌న ఆ రోజే!

రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ('అఖండ' ఫేమ్‌), సత్య, జయప్రకాష్ న‌టిస్తోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, సినిమాటోగ్ర‌ఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: డి.ఆర్.కె. కిరణ్, నిర్మాత: అభిషేక్ నామా, దర్శకత్వం; సుధీర్ వర్మ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com