పదహారేళ్ళ ప్రాయంలో వెంకటేశ్ 'లక్ష్మీ'
on Jan 14, 2022

సంక్రాంతి సీజన్ లో మెమరబుల్ హిట్స్ అందుకున్న అగ్ర కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ముగ్గుల పండక్కి వచ్చిన వెంకీ చిత్రాల్లో చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నే. వాటిలో `లక్ష్మీ` ఒకటి. అగ్ర దర్శకుడు వీవీ వినాయక్ రూపొందించిన ఈ సినిమాలో లక్ష్మీ నారాయణ అలియాస్ లక్ష్మీగా టైటిల్ రోల్ లో మెస్మరైజ్ చేశారు వెంకటేశ్. లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండీ అయిన లక్ష్మీ నారాయణ.. తన కుటుంబక్షేమం కోసం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆ ఇంటి దత్తపుత్రుడైన లక్ష్మీ వాటిని పరిష్కరించి ఎలా కుటుంబాన్ని చక్కదిద్దాడు? అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
Also read: జనవరి 13.. నందమూరి మూడు తరాలకు అచ్చొచ్చిన తేది!
వెంకటేశ్ కి జోడీగా నయనతార, ఛార్మి నటించిన ఈ సినిమాలో శర్వానంద్, రాజీవ్ కనకాల, ఉమ, జయభారతి, రేవతి, సునీల్, ప్రదీప్ రావత్, రంగనాథ్, సుధ, సమీర్, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు, సత్యప్రకాశ్, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. రమణ గోగుల బాణీలందించిన ఈ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతమందించారు. పాటల్లో ``లక్ష్మీ బావ`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``తార తళుకు తార``, ``హే సత్యభామ``, ``అమ్మాయి ఆంధ్రామిర్చి``, ``ధగ ధగ`` పాటలు కూడా రంజింపజేశాయి.
Also read: మహేశ్ `బిజినెస్ మేన్`కి పదేళ్ళు!
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి నిర్మించిన ఈ సినిమా 94 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. బెంగాలీలో `సంఘర్ష` (2007), బెంగాలీ బంగ్లాదేశ్ లో `పితా మతోర్ అమనోత్` (2008) పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది. 2006 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించిన `లక్ష్మీ`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



