Home

»

Latest News

మెగాస్టార్ తో మాస్ మ‌హారాజా.. అధికారిక‌ ప్ర‌క‌ట‌న ఆ రోజే!

Jan 12, 2022

2000 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఒక‌టైన `అన్న‌య్య‌`లో మెగాస్టార్ చిరంజీవికి త‌మ్ముడిగా అల‌రించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. అంత‌కుముందు హిందీ చిత్రం `ఆజ్ కా గుండారాజ్`(1992)లో చిరు స్నేహితుడిగానూ, ఆ త‌రువాత `శంక‌ర్ దాదా జిందాబాద్` (2007)లో అతిథిగానూ ఎంట‌ర్టైన్ చేశారు ర‌వితేజ‌. క‌ట్ చేస్తే.. దాదాపు ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం త‌రువాత వీరిద్ద‌రు మ‌రోమారు క‌లిసి న‌టించ‌బోతున్నారంటూ గ‌త కొంత‌కాలంగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిరంజీవితో `ప‌వ‌ర్` ద‌ర్శ‌కుడు బాబీ రూపొందిస్తున్న `మెగా 154` (వ‌ర్కింగ్ టైటిల్)లో ర‌వితేజ ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపిస్తారంటూ.. కొద్ది రోజులుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ పాత్ర కోసం మాస్ మ‌హారాజా భారీ పారితోషికం కూడా అందుకోబోతున్న‌ట్లు బ‌జ్. కాగా, ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న `మెగా 154`లో త‌న ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఇన్ సైడ్ టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న `మెగా 154`.. అన్నీ అనుకూలంగా ఉంటే ఇదే ఏడాది థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌వితేజ చేతిలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` చిత్రాలు ఉన్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com