చేతిలో రాయితో చంద్రమోహన్‌ను తరిమిన అలీ కూతురు!
on Jul 5, 2021
.jpg)
సీనియర్ నటుడు చంద్రమోహన్‌కు ఓ అలవాటు ఉండేది. ఎవరైనా చిన్నపిల్లలు తన దగ్గరకు వచ్చినా, తన పక్కన కూర్చున్నా.. వారితో కబుర్లు చెబుతూనే చెవిపై వేళ్లతో చిటుక్కుమని కొట్టేవారు. అది చురుక్కుమనిపించేది. కొంతమంది ఏడ్చుకుంటూ వెళ్లేవారు కూడా. అలీ బాలనటుడిగా ఉన్నప్పుడు చంద్రమోహన్‌కు అలా బాధితుడే. అందుకే సెట్స్‌పై చంద్రమోహన్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చినా, ఆయన తనను పిలిచినా రెండు చేతులతో చెవులు కప్పుకొని బితుకుబితుకుమంటూ వెళ్లేవాడు అలీ.
ఒకసారి ఓ సినిమా షూటింగ్‌కు అలీ వెళ్లినప్పుడు వాళ్లమ్మాయి కూడా వస్తానంటే, డ్రైవర్‌ను పంపించి, షూటింగ్ లొకేషన్‌కు రప్పించుకున్నాడు అలీ. ఆ పాపతో పాటు అలీ కజిన్ కొడుకు కూడా వెంట వచ్చాడు. అలీ కూతురు కంటే ఆ బాబు కొంచెం ఎత్తుగా, బలంగా ఉంటాడు. అప్పుడక్కడ సెట్స్ మీద చంద్రమోహన్ ఉన్నారు. ఆ బాబును దగ్గరకు పిలిచి, "ఏం పేరురా?" అని అడుగుతూనే చెవిపై తన అలవాటు ప్రకారం వేళ్లతో కొట్టారు చంద్రమోహన్. ఆ అబ్బాయి "అబ్బా" అని బాధతో చెవి పట్టుకున్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువ.
ఇదంతా అలీ కూతురు చూసింది. అక్కడ అటూ ఇటూ చూసి, ఓ పెద్ద రాయిపట్టుకొని చంద్రమోహన్ దగ్గరకు వచ్చి, "ఇప్పుడు కొట్టు.." అంది రాయి చూపిస్తూ. ఆ పాప పోజు చూస్తే నిజంగా రాయితో కొట్టేట్లు కనిపించింది. ఇది ఏమాత్రం ఊహించని చంద్రమోహన్‌కు ఒక్కసారిగా భయమేసింది. కంగారుగా "రేయ్ అలీ.. ఆపరా దాన్ని" అని కేకలు పెట్టారు. లేచి, పరుగందుకున్నారు. ఆ పాప వెంటపడింది. ఆయన అరుస్తూనే పరుగెత్తుతున్నారు. ఆ పాప అలాగే తరుముతూ వచ్చింది. మొత్తానికి అలీ కేకవేసి, కూతుర్ని ఆపేశాడు. లేకపోతే.. ఆరోజు చంద్రమోహన్ పరిస్థితి ఏమయ్యాదో! ఇప్పటికీ అలీ కూతుర్ని చూస్తే తనకు భయమేస్తుందని ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ వెల్లడించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



