మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో నాలుగో మూవీ
on Jul 5, 2021

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, క్రేజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన మలయాళ మూవీ 'దృశ్యం' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్లా విజయం సాధించింది. ఇక ఇటీవల మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో 'దృశ్యం 2' పేరుతో సీక్వెల్ రాగా.. దృశ్యం మూవీకి మించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కాంబినేషన్ అంటే ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ప్రస్తుతం 'రామ్' అనే చిత్రం రూపొందుతోంది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో మూవీ రానుంది. వీరిద్దరూ మరో మిస్టరీ థ్రిల్లర్ కోసం కలిసి పని చేయబోతున్నారు. అదే "12th మ్యాన్".
ఆశీర్వాద బ్యానర్ పై ఆంటోని పెరంబవూర్ "12th మ్యాన్" సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ అప్పుడే మూవీపై అంచనాలు పెంచేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



