నన్ను ఎలిమినేట్ చేసింది కేవలం పర్సనల్ గ్రడ్జ్ తోనే!!
on Oct 20, 2022
చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటర్వూస్ ఇచ్చాడు. అందులో ఎన్నో సంచలన విషయాలను వెల్లడించాడు. ఇక ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో కొన్ని హాట్ కామెంట్స్ చేసాడు. "బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదు రీలిటీ షో. ఇక హౌస్ లో పుల్లటి పులిహోర కలిపేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో అర్జున్, సత్య, ఇనయ, సూర్య లవ్ ట్రాక్స్ మాములుగా లేవు. హౌస్ లో అందరూ ట్రాక్స్ వేస్తున్నారు. హౌస్ నుంచి బయటికి వచ్చాకే వీళ్లంతా ప్యాంట్లు వేయడం స్టార్ట్ చేస్తారు. ప్రపంచం చాలా చిన్నది. అందరూ నాకు ఎక్కడో ఒక చోట దొరక్కపోరు. కొంతమందినైతే పక్కాగా ఆడుకుంటా. ఇంకొంతమందిని అప్పటి పరిస్థితులను బట్టి ఆడుకుంటా." అని చెప్పాడు.
"ఈ ప్రపంచంలో బలుపు, పొగరు, ఇగో లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. మరి నాకూ అంతే. అవన్నీ వున్నాయి" అనేది అతని మాట. "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం నాకు ప్లస్ అయ్యింది. బయటికి వచ్చాక నాకు చాలామంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎప్పటికీ నిజాయితీనే గెలుస్తుంది. కానీ కొంత టైం పడుతుంది. నాలో కోపంతో కూడిన, బలుపుతో కూడిన మంచితనం ఉంది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచి ఏ టాస్క్స్ ఇచ్చారో అవే చేసాను. నన్ను ఎలిమినేట్ చేసింది కేవలం పర్సనల్ గ్రడ్జ్ తోనే" అని అతను అభిప్రాయపడ్డాడు.
ఈరోజుల్లో ఎవరికీ మంచి చెప్పకూడదు అని అర్థమయ్యిందంటోన్న అతను, "శ్రీహాన్ మాత్రం టాప్ 5లో ఉంటాడు" అని ఎన్నో విషయాలు చెప్పాడు చంటి.