తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి!
on Oct 20, 2022
దేత్తడి హారిక యూట్యూబ్ స్టార్ గా అందరికీ తెలుసు. బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ కూడా అయ్యింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈమెకు మంచి ఆఫర్స్ వచ్చాయి. అలా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు, ఆ సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారిక చాలా క్లోజ్‌గా ఉండేది. ఇక వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు హారిక. "ఇద్దరం ఫ్రెండ్స్" అని మాత్రమే చెప్పుకొచ్చింది.
ఇక ఈ మధ్య కాలంలో క్యూట్ హారిక పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌ను ప్రేమిస్తోందనీ, అతనితో కలిసి సీక్రెట్ గా డేటింగ్ చేస్తోందనీ బోల్డు వార్తలు హల్చల్ చేశాయి. మరి ఇంతలో ఏమయ్యిందో ఏమో ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "లెట్స్ గో" అనే టాస్క్ ఇచ్చేసరికి ఒక నెటిజన్ "ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావ్?" అంటూ ఒక ప్రశ్న అడిగాడు.
దానికి హారిక రిప్లై ఇచ్చింది. "తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి" అంటూ రజినీకాంత్ స్టయిల్లో జవాబిచ్చింది. "మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎలా దాని నుంచి బయటపడతారు?" అని ఇంకో నెటిజన్ అడిగితే, "నేను డిప్రెషన్ లో ఉన్నానో అప్సెట్ అయ్యానో నాకే తెలియని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నా.." అని జవాబిచ్చింది.
Also Read