అల్లు అర్జున్ సరైనోడు రీషూట్ చేస్తున్నారా..?
on Apr 12, 2016

అల్లు అర్జున్ సరైనోడు షూట్ పూర్తిగా అయిపోయింది. ఇప్పటికే u/a సర్టిఫికెట్ కూడా సెన్సార్ బోర్డ్ ఇచ్చేసిందని చెబతున్నారు. ఇలాంటి టైంలో రీషూట్ కు వెళ్తున్నారనే మాట వినిపిస్తోంది. అన్ని సీన్లు కాకపోయినా, కొన్ని చోట్ల కాస్త బెటర్ మెంట్ ఉండాలని అనుకున్న సీన్లను మాత్రం రీషూట్ చేయాలని మూవీ టీం భావిస్తోందట. ఇంతకీ ఈ ఆలోచన ఇప్పుడెందుకొచ్చిందా అని చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి కి బన్నీ ఈ సినిమాను చూపించాడట. చూసిన తర్వాత చిరు కొన్ని కరెక్షన్లు చెప్పారని, బన్నీ కూడా అలా చేస్తే బాగుంటుందని భావించాడట. అందుకే కొన్ని సీన్లను రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. వీటికి పెద్ద టైం కూడా పట్టదు, పైగా రిలీజ్ కు చాలా టైం ఉంది కాబట్టి, సినిమాను మరింత బాగా చెక్కడంలో తప్పేం లేదు కదా అని బన్నీ భావిస్తున్నాడట. ఏం చేసినా, వెండితెరపై మీద మొదటి షో పడిన తర్వాత ఆడియన్స్ కు నచ్చితే సరిపోతుంది మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



