'బ్రో' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. రికవరీ శాతం ఎంతంటే..!
on Jul 31, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ 'బ్రో'.. శుక్రవారం (జూలై 28) జనం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ. 97 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన 'బ్రో'.. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.30.01 కోట్ల షేర్ రాబట్టుకోగా, రెండో రోజు రూ. 12. 32 కోట్ల షేర్ చూసింది. ఇక మూడో రోజు రూ. 12. 93 కోట్ల షేర్ ఆర్జించింది. మొత్తంగా తొలి వారాంతం రూ. 55. 26 కోట్ల షేర్ తో 56. 96 శాతం రికవరీ చూసింది. మండే టెస్ట్ లో పాసై.. వీక్ డేస్ లోనూ మంచి వసూళ్ళు రాబట్టగలిగితే 'బ్రో' బ్రేక్ ఈవెన్ కి పక్కాగా స్కోప్ ఉన్నట్టే. మరి.. 'బ్రో' ఈ వారంలో ఏ తీరున సాగుతుందో చూడాలి.
ఏరియాల వారిగా 'బ్రో' First weekend (3 Days) కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నైజాం: రూ. 17.45 కోట్ల షేర్ (జి.ఎస్.టితో కలుపుకుని)
సీడెడ్: రూ. 5.56 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర: రూ. 5.74కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
ఈస్ట్ గోదావరి: రూ. 3.93 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
వెస్ట్ గోదావరి: రూ. 3. 74 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
గుంటూరు: రూ. 4.00 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
కృష్ణా: రూ. 2.75 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
నెల్లూరు: రూ. 1.39 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
ఆంధ్ర + తెలంగాణ మొత్తం: రూ. 44.56 కోట్ల షేర్ (రూ. 52. 50 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ. 4.85 కోట్లు
ఓవర్సీస్: రూ. 5.85 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ (తొలి మూడు రోజులు) కలెక్షన్స్: రూ.55.26 కోట్ల షేర్ (రూ. 91.75 కోట్లు గ్రాస్)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
