'బ్రో' వచ్చినా తగ్గేదేలే అంటున్న 'బేబీ'
on Jul 31, 2023
'బేబీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపించింది. జూలై 28న 'బ్రో' రాకతో ఇక 'బేబీ' పనైపోయిందని భావించారంతా. కానీ 'బ్రో' వచ్చిన తర్వాత కూడా 'బేబీ' తన ఉనికిని చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం 58 లక్షల షేర్, శనివారం రూ.74 లక్షల షేర్ రాబట్టిన బేబీ, 17వ రోజైన ఆదివారం నాడు ఏకంగా రూ.1.15 కోట్ల షేర్ తో సత్తా చాటింది. పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ నటించిన 'బ్రో' ప్రభంజనాన్ని తట్టుకొని 'బేబీ' ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమే.
17 రోజుల్లో నైజాంలో రూ.14.60 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.5.19 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.14.28 కోట్ల షేర్ రాబట్టిన బేబీ సినిమా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.34.07 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.40 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.2.55 కోట్ల షేర్ కలిపి.. 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.39.02 కోట్ల షేర్(రూ.73.25 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రస్తుతం బేబీ జోరు చూస్తుంటే త్వరలో రూ.40 కోట్ల షేర్(రూ.75 కోట్ల గ్రాస్) మార్క్ ని అందుకోవడం ఖాయమనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
