న్యాయం చేయమంటున్న బ్రహ్మోత్సవం డిస్ట్రిబ్యూటర్స్...!
on May 30, 2016
బ్రహ్మోత్సవం సినిమాను ఫ్యాన్సీ రేట్లకు కొని భారీగా నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అదే రేంజ్ లో లాభాలు వస్తాయని భావించి ఎంతకు చెబితే అంతకు కొనేశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత ఫలితం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. భారీ నష్టాల్లో కూరుకుపోయారు బయ్యర్లు. ఈ నేపథ్యంలో, తెలంగాణా ఎగ్జిబిటర్లందరూ కలిసి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒక లేఖ రాశారని అంటున్నారు సినీజనాలు. తమకు వచ్చిన తీవ్ర నష్టాల్లో, కనీసం కొంతైనా సినిమా నిర్మాత, హీరో, దర్శకుడు కాంపన్సేట్ చేయాలంటూ లెటర్ లో కోరుతున్నారు. సినిమాకు పెట్టిన దానిలో కేవలం 20 శాతమే తిరిగొచ్చిందని, 80 శాతం లాస్ లో ఉన్నామని తమను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. గతంలో బాబా సినిమా భారీ నష్టాలు మిగిల్చినప్పుడు రజనీకాంత్ తన సినిమా బయ్యర్లకు సాయం చేశారు. బ్రహ్మోత్సవం నిర్మాత, హీరో కూడా ఇలాంటి సాయం చేసి తమను ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖపై ఫిల్మ్ ఛాంబర్, బ్రహ్మోత్సవం టీం ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
