మళ్లీ దానికి సైన్ చేసిన త్రిష..!
on May 30, 2016
హర్రర్ కామెడీ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ బాగుంది. సింపుల్ గా ఒక ఇంట్లో, ముగ్గురు నలుగురు క్యాస్టింగ్ తో ఏమాత్రం రిస్క్ లేని బడ్జెట్ తో ఇలాంటి సినిమాలు తెరకెక్కించేస్తున్నారు. కొద్దిగా భయపెట్టి, మరికొంచెం నవ్వించగలిగితే, ఓ మినిమం గ్యారంటీ హిట్టు ఖాతాలో పడిపోతుంది. ముఖ్యంగా ఫేడవుట్ అయిపోతున్న హీరోయిన్లకు ఈ జానర్ బాగా దొరికింది. ఇక కెరీర్ ముగిసిపోయిందనుకున్న త్రిష కూడా ఇలాంటి సినిమాలతోనే ప్రేక్షకులపై దాడి చేస్తోంది. ఆల్రెడీ కళావతి తో యావరేజ్ హిట్ కొట్టి, మరో హర్రర్ సినిమా ' నాయకి ' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న త్రిష, మోహిని పేరుతో మరో హర్రర్ సినిమాకు సైన్ చేసిందంటున్నారు సినీజనాలు. తెలుగులో మోహిని అన్న పేరుకు ఎంత ప్రాచుర్యం ఉందో తెలిసిందే. ఇదే టైటిల్ తో భయపెట్టాలని త్రిష ఫిక్స్ అయిందని సమాచారం. మాదేశ్ దర్శకత్వంలో, తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుందట. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు రిలీజ్ చేస్తామంటున్నారు మూవీ టీం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
