డేట్ మారినా క్లాష్ తప్పట్లేదు.. మధ్యలో అబ్బవరం.. ఏమవుతుందో ఏంటో
on Sep 9, 2023
అదేమి చిత్రమో కానీ.. ఫస్ట్ ఒక తేదికి ఫిక్సయిన రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. తీరా చూస్తే.. రెండు కూడా మళ్ళీ ఒకే రోజుకి లాక్ అయ్యాయి. అప్పటికే మరో చిన్న సినిమా కూడా అదే తేదికి వచ్చేయబోతున్నట్లు ప్రకటించేశారు. మరి.. ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న 'స్కంద' రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇక అదే సెప్టెంబర్ 15న 'చంద్రముఖి 2'ని కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ ని కూడా అవే భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే ప్రభాస్ 'సలార్' సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడడంతో.. ఇప్పుడు ఆ తేదిని టార్గెట్ చేసుకున్నారు స్కంద, చంద్రముఖి 2 మేకర్స్. విశేషమేమిటంటే.. వీటికంటే ముందే కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ కూడా సేమ్ డేట్ (సెప్టెంబర్ 28)కి లాక్ అయింది. మరి.. రామ్ వర్సెస్ లారెన్స్.. మధ్యలో అబ్బవరం.. అన్నట్లుగా ఉన్న ఈ ముక్కోణపు పోటీలో ఎవరు హిట్ కొడతారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
