'ఆదికేశవ' ఫస్ట్ సింగిల్ వచ్చేసిందిగా.. శ్రీలీలతో వైష్ణవ్ కెమిస్ట్రీ అదిరింది!
on Sep 9, 2023
'ఉప్పెన' వంటి సంచలన చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా తొలి అడుగేశాడు పంజా వైష్ణవ్ తేజ్. మెగాబ్రదర్స్ మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు అనే ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మొదటి సినిమాలోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు వైష్ణవ్. అయితే ఆ తరువాత వచ్చిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం అనంతరం 'ఆదికేశవ'గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు మిస్టర్ తేజ్. క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ కావడంతో.. సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే.. శనివారం (సెప్టెంబర్ 9) ఆదికేశవ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. "సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటున పోయే మతి" అంటూ మొదలయ్యే ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది. అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ బాణీకి రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా వాణి తోడై పాట మెలోడీయస్ గా సాగింది. ఇక రామజోగయ్య శాస్త్రి తనదైన సాహిత్యంతో ఇట్టే ఆకట్టేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకి కలిసొచ్చే అంశమే. ఓవరాల్ గా.. ఆదికేశవ మొదటి లిరికల్ వీడియో బాగుందనే చెప్పొచ్చు.
దీపావళి కానుకగా నవంబర్ 10న ఆదికేశవ థియేటర్స్ లోకి రాబోతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి రూపొందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
