`#SSMB28`.. ఫాదర్గా బాలీవుడ్ స్టార్?
on May 4, 2021
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో తండ్రి పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంటుంది. దర్శకుడిగా తన మొదటి సినిమా `నువ్వే నువ్వే` నుంచి గత చిత్రం `అల వైకుంఠపురములో` వరకు హీరో లేదా హీరోయిన్ ఫాదర్ రోల్స్ చుట్టూనే త్రివిక్రమ్ సెల్యులాయిడ్స్ ఎక్కువగా నడిచాయి. వాటన్నింటిలోనూ ప్రముఖ నటులే కనిపించారు. ఇప్పుడిదే శైలిని తన కొత్త చిత్రం విషయంలోనూ కొనసాగించబోతున్నారట ఈ ఏస్ కెప్టెన్.
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ మరో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. `#SSMB28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోనూ తండ్రి పాత్ర ఉందట. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ దర్శనమిస్తారట. అంతేకాదు.. ఇదో డాన్ పాత్ర టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించిన అనిల్ కపూర్.. తెలుగు చిత్రం `వంశవృక్షం`(1980)తోనే నటుడిగా తొలి అడుగేశారు. చాన్నాళ్ళ తరువాత మళ్ళీ ఆయన టాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనుండడం విశేషమనే చెప్పాలి.
Also Read