తమన్నా `నవంబర్ స్టోరీ` స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
on May 4, 2021
`లెవెన్త్ అవర్`తో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ తెలుగు వెబ్ - సిరీస్ గత నెల 9న `ఆహా` ఓటీటీలో స్ట్రీమ్ అయి.. మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కట్ చేస్తే.. ఐదు వారాల తరువాత మరో వెబ్ - సిరీస్ తో పలకరించనుంది తమన్నా. ఈ సారి కూడా క్రైమ్ థ్రిల్లర్ తోనే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ సందడి చేయనుండడం విశేషం. ఆ సిరీస్ నే `నవంబర్ స్టోరీ`.
ఇంద్ర సుబ్రమణియన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో అనురాధ గణేశన్ పాత్రలో కనిపించనుంది తమన్నా. క్రైమ్ నవల రచయిత అయిన తన తండ్రిపై పడ్డ నిందని తొలగించే క్రమంలో కథానాయికకి ఎదురైన అనుభవాల నేపథ్యంలో `నవంబర్ స్టోరీ` రూపొందింది. ఆనంద్ వికటన్ నిర్మించిన ఈ సిరీస్ ప్రధానంగా తమిళంలో రూపొందినప్పటికీ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాద రూపంలో అందుబాటులో ఉండనుంది. మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో `నవంబర్ స్టోరీ` స్ట్రీమింగ్ కానుంది.
మరి.. `లెవెన్త్ అవర్` ఆశించిన స్థాయిలో వీక్షకాదరణ పొందని నేపథ్యంలో.. `నవంబర్ స్టోరీ` అయినా ఆ లోటుని భర్తీ చేస్తోందేమో చూడాలి.
Also Read