40వ బర్త్‌డే జరుపుకున్న పవన్ హీరోయిన్
on Jun 12, 2016
నువ్వు నందా అయితే నేను బద్రీ..బద్రీనాథ్ అంటూ బద్రీ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ఆ సినిమాలో పవన్‌తో పాటు నటించిన హీరోయిన్లు గుర్తున్నారా..? వారిలో ఒకరు రేణుదేశాయ్ ..తర్వాతి కాలంలో పవర్‌స్టార్‌ను పెళ్లాడగా, మరో హీరోయిన్ అమీషా పటేల్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి అమీషాపటేల్. ఈ బ్యూటి బాలీవుడ్‌లో కొన్ని హిట్ సినిమాల్లో నటించి ఆడపాదడపా తెలుగువారిని పలకరించి మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. బ్యాంకాక్‌లోని ఓ రిసార్ట్స్‌లో అమిత్‌షా తన 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంది. తన బిజినెస్ పార్ట్‌నర్ పరిణీత్ కునాల్, ఆయన భార్య షామిలీతో కలిసి అమీషా కేక్ కట్ చేసింది. ఆ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు అప్పుడే అమీషాకు 40 ఏళ్లొచ్చాయా..! అనుకుంటూ పనిలో పనిగా బర్త్‌డే గ్రీటింగ్స్ కూడా చెబుతున్నారు.
Also Read