చిత్ర పరిశ్రమపై కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
on Jun 12, 2016
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలనాటి నటులు కైకాల, జమునలకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కైకాల తెలుగు చలన చిత్రపరిశ్రమ పెద్దలపై విరుచుకుపడ్డారు. పరిశ్రమలో సీనియర్ నటులకు ఎంతమాత్రమూ గౌరవం దక్కడం లేదన్నారు. ఏ సినిమా వేడుక, ఎప్పుడు జరిగిందో తెలియడం లేదని, తమతో పాటు మిగిలిన సీనియర్ నటులను మంచి మనసుతో అన్ని కార్యక్రమాలకూ ఆహ్వానిస్తే మంచిదని సూచించారు. అయితే మా అసోసియేషన్ మంచి కార్యక్రమాలను చేపడుతోందని ప్రశంసించారు. ఈ సత్కార కార్యక్రమలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, విష్ణు, నరేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మీ, ఆహుతి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read