రోహిత్‌శెట్టి పెద్దమనసు..10 మంది కేన్సర్ పిల్లల దత్తత
on Jun 12, 2016
చాలా మంది సినీ ప్రముఖులు అనాధలను దత్తత తీసుకుని తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ దారిలో అందరికంటే ముందున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్‌శెట్టి. ప్రతి ఏటా కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారికి విద్యావసరాలు చూస్తున్న రోహిత్‌శెట్టి..కొంతమంది కేన్సర్ బాధితులకు సహాయసహకారాలు అందించేవాడు. అయితే ఈసారి ఏకంగా 10 మంది కేన్సర్ బాధిత చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారందరికీ వైద్యసహాయంతో పాటు, వారి విద్యకు ఏర్పాట్లు చేయనున్నట్లు రోహిత్‌శెట్టి తెలిపాడు. ఈ చర్యను బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.