'బ్లాక్ పాంథర్' సీక్వెల్ రిలీజ్ డేట్ తెలిసింది!
on Aug 25, 2019
చాడ్విక్ బోస్‌మన్ టైటిల్ రోల్ చేసిన 'బ్లాక్ పాంథర్' సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం విదితమే. ఆ మూవీకి సీక్వెల్ తీసుకు రావాలని మార్వెల్ స్టూడియోస్ సంస్థ ప్లాన్ చేస్తోంది. తాజాగా దాని రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ ర్యాన్ కూగ్లర్ అనౌన్స్ చేశాడు. 2022 మే 6న 'బ్లాక్ పాంథర్' సీక్వెల్ రిలీజవుతుందని ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్టుకు రైటర్స్ తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇందులో సరికొత్త విలన్ దర్శనమివ్వనున్నాడు. ఈ సీక్వెల్ టైటిల్ ఏమిటనేది ఇంకా ఖరారు చెయ్యలేదు. ఈ మూవీ కంటే ముందు మార్వెల్ నుంచి 5 సినిమాలు రానున్నాయి. అవి.. 'బ్లాక్ విడో' (2020 మే 1), 'ది ఎటర్నల్స్' (2020 నవంబర్ 6), 'షాంగ్-చి అండ్ ద లెజెండ్స్ ఆఫ్ ద టెన్ రింగ్స్' (2021 ఫిబ్రవరి 12), 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' (2021 మే 7), 'థోర్': లవ్ అండ్ థండర్' (2021 నవంబర్ 5).
'బ్లాక్ పాంథర్' విషయానికి వస్తే 2018 ఫిబ్రవరిలో వచ్చిన ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్కార్ అవార్డుల్లో 7 నామినేషన్స్ పొంది, చివరకు 3 అవార్డుల్ని సాధించింది. ఎక్కువ మంది బ్లాక్ యాక్టర్స్ నటించగా బ్లాక్‌బస్టర్ అయిన మూవీగా కూడా ఇది చరిత్ర సృష్టించింది. బోస్‌మన్‌తో పాటు లెటీషియా రైట్, ల్యూపిటా న్యోంగో, ఫారెస్ట్ విటేకర్, మైఖెల్ బి. జోర్డాన్, ఏంజెలా బాసెట్ వంటి ఆర్టిస్టులు ఇందులో నటించారు.
Also Read