బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడు..!
on Jun 4, 2016
.jpg)
బిచ్చగాడు టైటిల్ చూసి, ఇదేం సినిమారా అనుకున్నారు సినీజనాలు. అటు 24, ఇటు బ్రహ్మోత్సవం, ఇంక ఈ సినిమాకు స్కోప్ ఎక్కడుంటుందిలే అని భావించారు. అందుకే తెలుగు రైట్స్ కేవలం 50 లక్షలు మాత్రమే పలికాయి. అసలు రిలీజ్ చేసేప్పుడు నిర్మాతలకు కూడా ఏమాత్రం ఐడియా లేదు, ఈ సినిమా తమకు డబుల్ త్రిపుల్ లాభాలు తీసుకొస్తుందని. రిలీజైన తర్వాత మొదటి రోజు అంతంత మాత్రంగానే నడిచింది. సింగిల్స్ స్క్రీన్స్ తప్పితే, మల్టీప్లెక్స్ లో చోటు కూడా లేదు. అలాంటి బిచ్చగాడు సినిమా ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..అక్షరాలా 8 కోట్లు. నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఇది నిజం. బ్రహ్మోత్సవం చతికిలపడటం, కాస్త రిఫ్రెషింగ్ గా డిఫరెంట్ గా అనిపించే సినిమాలు లేకపోవడంతో, బిచ్చగాడిని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ, ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోయింది. సినిమాలో విషయం ఉండటంతో హాల్స్ లో నిలబడింది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ లోకి కూడా ఎంటరైపోయింది. ఫుల్ థియేట్రికల్ రన్ ముగిసేసరికి బిచ్చగాడు పదికోట్లు సాధిస్తాడని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



