బాహుబలి సినిమాయే తమిళ తంబీల టార్గెట్..?
on Jun 4, 2016

మనకంటే సినిమాల్లో చాలా అడ్వాన్స్‌డ్ గా ఉన్నామని భావిస్తుంటారు తమిళ తంబీలు. దానికి తగ్గట్టుగానే, మన నుంచి గత కొనేళ్లుగా అరా కొరా మంచి సినిమాలు తప్ప, పెద్దగా గొప్ప సినిమాలు వచ్చింది లేదు. ఎన్టీఆర్, ఎఎన్నార్, ఆ తర్వాత చిరు బాలయ్య టైంలో కూడా తెలుగు సినిమాలు మంచి పేరే సంపాదించుకున్నాయి. అయితే కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది. మన సినిమా స్థాయి ఇంతేనా అని సగటు తెలుగు సినిమా అభిమాని బాధపడుతున్న ఇలాంటి సమయంలో తెలుగు సినిమా సత్తాను ఇండియాకు, ప్రపంచానికి రుచి చూపించింది బాహుబలి.
దర్శక జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ దెబ్బకు, టాలీవుడ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. వరస రికార్డ్స్ తో తెలుగోడి తాకిడికి బాక్సాఫీస్ ఎలా షేక్ అవుద్దో చిన్న శాంపిల్ వదిలింది. అయితే వెంటనే తమిళోళ్లు ఎలాగైనా దీన్ని దాటే సినిమా తీయాలని విజయ్ హీరోగా పులి అని సినిమాను తీసేశారు. అది కాస్తా బాక్సాఫీస్ మీద బాంబ్ వేసి వెళ్లిపోయింది. అయినా తమ ప్రయత్నాలు మాత్రం ఆపం అంటున్నారు. అక్కడి సీనియర్ డైరెక్టర్ సుందర్.సి బాహుబలి తరహా సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు. తెండ్రాల్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ 250 కోట్ల హెవీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుందట. బాహుబలికి ఆర్ట్ డైరెక్షన్ చేసిన సాబు సిరిల్ ను ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా తీసుకున్నారట. సంగీత బాధ్యతలు రెహమాన్ కు ఇచ్చే అవకాశం ఉంది. ఎలా అయినా బాహుబలి దాటడమే తమ టార్గెట్ అంటున్నారు కోలీవుడ్ జనాలు. ఇక ఈ సినిమాకు సూర్యను హీరోగా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



