చిరు 150 లో బాలీవుడ్ భామ..?
on Jun 4, 2016

మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ సినిమాకు హీరోయిన్ ఎవరు..? ఈ విషయంపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. ఇప్పటి వరకూ నయనతార, అనుష్క, తమన్నాల పేర్లు అయిపోయాయి.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల వంతు వచ్చినట్టుంది. దీపికా పదుకొనే ను హీరోయిన్ గా తీసుకున్నారంటున్నారు సినీజనాలు. చిరు ల్యాండ్ మార్క్ సినిమా కావడంతో క్యాస్టింగ్ కూడా భారీ రేంజ్ లోనే ఉండాలని ప్లాన్ చేస్తుండటంతోనే బాలీవుడ్ హీరోయిన్ వైపు మొగ్గు చూపారట. మూవీలో యాక్ట్ చేయడానికి దీపిక కూడా ఒకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఆమెను తీసుకోవడం ద్వారా, క్రేజీ కాంబినేషన్ కూడా వర్కవుట్ అవుతుందని మూవీ టీం ప్లాన్. జూన్ 15 నుంచే కత్తిలాంటోడు షూటింగ్ షురూ కానుంది. మొత్తమ్మీద అటు బాలయ్య, ఇటు చిరు తమ ల్యాండ్ మార్క్స్ కోసం ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ యాక్టర్స్ ను దింపేస్తున్నారుగా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



