ఏప్రిల్ 1కి మారిన 'భీమ్లా నాయక్' రిలీజ్?
on Jan 31, 2022

కొంత కాలంగా సినిమాల విడుదల తేదీలు పదే పదే మారుతూ సర్కస్‌ను తలపిస్తున్నాయి. ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించడం, మళ్లీ ఏదో ఒక అవాంతరంతో వాయిదావేసి, మరో తేదీని ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇదంతా కొవిడ్ 19 మహమ్మారి కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల వల్లేనని అర్థం చేసుకోవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది.
Also read: తారక్ - బుచ్చిబాబు సినిమాలో జాన్వి!?
అందుతున్న సమాచారం ప్రకారం 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25న విడుదల కావట్లేదు. ఆ మూవీని ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 1న మహేశ్ 'సర్కారు వారి పాట', చిరంజీవి-రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు 'భీమ్లా నాయక్' కూడా వస్తే.. ఉగాది పండుగకు బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరుగుతుంది.
Also read: త్రివిక్రమ్ తో మరో హ్యాట్రిక్ కి స్కెచ్!
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'భీమ్లా నాయక్'కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



